ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 13:59:15

టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

జనగాం : టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ.. మార్గ మధ్యంలో జనగామ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల విషయమై తగు సూచనలు చేశారు. త్వరలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు.


logo