శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 00:04:54

ఎరువుల కొరత ఉండొద్దు

ఎరువుల కొరత ఉండొద్దు

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున వానకాలం సీజన్‌ ముందే ప్రారంభమైందని, రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఎరువుల కొరత అనేమాట వినిపించవద్దని సూచించారు. శనివారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను ఆకస్మికంగా తనిఖీచేసి భవనాలు, పరిసరాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల సమీక్షలో ఎరువులు, రైతు వేదికలపై చర్చించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులన్నీ నిండుతున్న నేపథ్యంలో యూరియా, ఎరువులకు డిమాండ్‌ పెరుగుతున్నదని, రేక్‌పాయింట్ల నుంచి మండలాలవారీగా ఎంపికచేసిన స్టాక్‌ పాయింట్లకు ఎరువులను తరలించి పంపిణీకి సిద్ధంచేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా, ఎరువుల కోటాను ఎప్పటికప్పుడు డ్రా చేయాలని పేర్కొన్నారు. రైతులంతా సంఘటితమైతే వ్యవసాయం లాభాలపంట అవుతుందని, మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతువేదికల నిర్మాణానికి ఇప్పటివరకు 2,588 చోట్ల స్థల సేకరణ పూర్తయిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవసాయశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, జాయింట్‌ డైరెక్టర్లు విజయగౌరి, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo