బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 15:55:24

జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్‌

జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫిసర్‌ ఉండేలా చూడాలని కోరారు. ఈ రోజు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చే ప్రతీ వ్యక్తి డాటా ఉండాలని, వారిని ట్రాక్‌ చేయాలని మంత్రి సూచించారు. కరీంనగర్‌కు గ్రానైట్‌ వ్యాపారం కోసం వచ్చిన చైనా, ఉజ్జెకిస్తాన్‌ వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచినట్లు కరీంనగర్‌ జిల్లా వైద్య అధికారి తెలిపారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు సెక్రటరీ స్థాయి నుంచి ఆశా వర్కర్‌ వరకు అందరూ పనిచేయాలని తెలిపారు. దీనికి జిల్లాలోని వైద్య అధికారులు బాధ్యత వహించాలి. సిబ్బంది, డాక్టర్లు సమయ పాలన పాటించకపోయినా... విధులు సరిగా నిర్వహించకపోయినా ఉపేక్షించేది లేదని అటువంటి వారిని సస్పెండ్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని, పేషంట్ల రద్దీకి అనుగూణంగా డాక్టర్ల్స్‌, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రతీ గ్రామంలో ఉన్న పాఠశాలల్లో ఆశవర్కర్స్‌, వైద్య సిబ్బంది కోవిడ్‌ - 19పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కోరారు. కరోనావైరస్‌పై యుద్దం చేద్దాం. అవగాహన కల్పిస్తే విజయం మనదే అన్నారు. వైరస్‌ కేసులు నమోదు కాలేదని రిలాక్స్‌ అవ్వొద్దని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 


logo