ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:14:36

అర్ధరాత్రి మంత్రి ఈటల ఆపన్నహస్తం

అర్ధరాత్రి మంత్రి ఈటల ఆపన్నహస్తం

  • కరోనా రోగి ట్వీట్‌పై స్పందించి గాంధీకి తరలింపు
  • పలువురు సినీప్రముఖులు, నెటిజన్ల హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రయినా ట్విట్టర్‌లో ఓ బాధితుడి వినతిపై తక్షణం స్పందించి వైద్యసాయం అందించడంపై మం త్రి ఈటలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ యూ సుఫ్‌గూడ కృష్ణ్ణానగర్‌కు చెందిన యువకుడు కరోనా బారిన పడ్డాడు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడం లో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా మంత్రి ఈటల రాజేందర్‌కు విన్నవించాడు. మంత్రి తక్షణమే స్పందించి పోలీసులను అప్రమత్తంచేసి అంబులెన్స్‌ను, వైద్యసిబ్బందిని పం పారు. అతడిని గాంధీ దవాఖానకు చేర్చేవరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో శ్రీకాంత్‌, అతని కుటుంబసభ్యులు మంత్రి స్పందనపై సంతోషం వ్యక్తంచేశారు. మంత్రి ఈటల చొరవ, స్పందించిన తీరును ప్రశంసిస్తూ సినీ దర్శకుడు హరీశ్‌శంకర్‌ ‘హ్యాట్సాఫ్‌ ఈటల’ అంటూ కొనియాడారు. గేయరచయిత రామజోగయ్యశాస్త్రి ‘దేవుడు ఎక్కడో లేడు.. వేరే కొత్తగా రాడు.. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తంచేశారు.logo