బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:15:07

24 గంటలూ డయాలసిస్‌ సేవలు

24 గంటలూ డయాలసిస్‌ సేవలు
  • మండలిలో మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వ్యాధి ముదిరితే డయాలసిస్‌ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మాత్రమే మార్గమన్నారు. బుధవారం మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ లు శేరి సుభాష్‌రెడ్డి, నర్సిరెడ్డి ప్రశ్నకు మం త్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 45 డయాలసిస్‌ సెంటర్లు నిర్వహిస్తున్నామని.. ఒక్కోసెంటర్లో 5 నుంచి 10వరకు బెడ్లు ఉన్నాయ న్నారు. కేంద్రానికి వచ్చే రోగులసంఖ్య ఆధారంగా 24 గంటలూ డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామన్నారు. ఒక్కో పేషంట్‌పై ఏడాదికి రూ.1.8 లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. కంటివెలుగు పథకంలో 40 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామన్నారు.logo
>>>>>>