e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home తెలంగాణ కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం : ‌మంత్రి ఈట‌ల

కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం : ‌మంత్రి ఈట‌ల

కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం : ‌మంత్రి ఈట‌ల

హైద‌రాబాద్ : కేసీఆర్ కిట్ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల వివ‌రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కం వ‌చ్చిన త‌ర్వాత 50 శాతానికి పైగా సాధార‌ణ ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 11,91,275 మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్ర‌వ‌రి) వ‌ర‌కు 2,58,341 మంది ల‌బ్ది పొందార‌ని పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం కోసం 2017-18లో రూ. 246.38 కోట్లు, 2018-19లో రూ. 273.83 కోట్లు, 2019-20లో రూ. 392.04 కోట్లు, 2020-21(ఫిబ్ర‌వ‌రి) వ‌ర‌కు రూ. 263.65 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత గ్రామాల్లో ప్ర‌భుత్వానికి ఎంతో ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. అమ్మ ఒడి వాహ‌నాల‌ను పెంచే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. గ‌ర్భిణి స్ర్తీల‌కు మంచి ఆరోగ్యం కోసం అంగ‌న్‌వాడీల నుంచి పోష‌కాహారం అందిస్తున్నామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం : ‌మంత్రి ఈట‌ల

ట్రెండింగ్‌

Advertisement