బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 08:44:40

ప్రధాని చెప్పారు.. ఈటల పాటిం‌చారు

ప్రధాని చెప్పారు.. ఈటల పాటిం‌చారు

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సి‌నే‌షన్‌ ప్రక్రి‌యను రాష్ట్ర వైద్యా‌రో‌గ్య‌శాఖ మంత్రి ఈటల రాజేం‌దర్‌ శని‌వారం గాంధీ దవా‌ఖా‌నలో ప్రారం‌భిం‌చారు. రాష్ట్రంలో తొలి టీకాను తానే వేసు‌కుం‌టా‌నని తొలుత ప్రక‌టిం‌చి‌న‌ప్ప‌టికీ ప్రధాని నరేంద్ర మోదీ సూచ‌నల మేరకు ఆ అవ‌కా‌శాన్ని గాంధీ దవా‌ఖాన సఫాయి కార్మి‌కు‌రాలు కిష్ట‌మ్మకు కల్పిం‌చారు. అనం‌తరం మంత్రి రాజేం‌దర్‌ మీడి‌యాతో మాట్లా‌డుతూ.. ‘క‌రోనా కష్ట‌కా‌లంలో ప్రజ‌లను కాపా‌డేం‌దుకు హెల్త్‌‌కేర్‌ వర్కర్లు ఎంతో శ్రమిం‌చారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పో‌యారు. అందుకే ముందుండి పోరాటం చేసిన దవా‌ఖాన పారి‌శుద్ధ్య కార్మి‌కు‌డికి తొలి వ్యాక్సిన్‌ ఇవ్వా‌లని ప్రధాని నరేం‌ద్ర‌మోదీ సూచిం‌చారు. అందుకే తొలి టీకా వారికే ఇచ్చాం’ అని చెప్పారు. తెలం‌గా‌ణలో తొలి రోజు 140 సెంట‌ర్లలో వ్యాక్సి‌నే‌షన్‌ ప్రారం‌భ‌మైం‌దని చెప్పారు. ఈ ప్రక్రియ నిరం‌తరం కొన‌సా‌గు‌తుం‌దని, హెల్త్‌ వర్క‌ర్లకు ఆ తర్వాత కేంద్రం సూచిం‌చిన విధంగా ఫ్రంట్‌‌లైన్‌ వారి‌య‌ర్లకు వ్యాక్సిన్‌ ఇస్తా‌మని తెలి‌పారు. రాష్ట్రా‌నికి కొవి‌షీల్డ్‌, కొవా‌గ్జిన్‌ వ్యాక్సిన్లు చేరు‌కు‌న్నా‌యని, తొలి‌రోజు కొవి‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చా‌మని చెప్పారు. వ్యాక్సిన్‌ విష‌యంలో ఎలాంటి అపో‌హలు వద్దని, ప్రాధాన్య క్రమంలో అంద‌రి‌కికీ కొవిడ్‌ టీకాలు అందు‌తా‌యని స్పష్టం చేశారు.

సాఫ్ట్‌‌వేర్‌ సమ‌స్యలు పరి‌ష్క‌రిం‌చండి 

కొవిడ్‌ వ్యాక్సి‌నే‌షన్‌ ప్రక్రి‌యలో కీల‌క‌మైన కొవిన్‌ సాఫ్ట్‌‌వే‌ర్‌లో ఏర్పడ్డ సాంకే‌తిక సమ‌స్యల వల్ల ఇబ్బం‌దులు ఎదు‌ర‌వు‌తు‌న్నా‌యని వైద్యా‌రో‌గ్య‌శాఖ మంత్రి ఈటల రాజేం‌దర్‌ చెప్పారు. సాఫ్ట్‌‌వే‌ర్‌ను మరింత సర‌ళ‌తరం చేయా‌ల్సిన అవ‌సరం ఉందని అభి‌ప్రా‌య‌ప‌డ్డారు. శని‌వారం వ్యాక్సి‌నే‌షన్‌ ముగి‌సిన తర్వాత అన్ని రాష్ర్టాల వైద్యా‌రో‌గ్య‌శాఖ మంత్రు‌లతో కేంద్ర‌మంత్రి హర్ష‌వ‌ర్ధన్‌ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హిం‌చారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్కే భవన్‌ నుంచి పాల్గొన్న మంత్రి ఈటల మాట్లా‌డుతూ.. కొవిన్‌ సాఫ్ట్‌‌వేర్‌ వల్ల ఏర్పడ్డ సమ‌స్యల గురించి ప్రస్తా‌విం‌చారు. సాంకే‌తిక సమ‌స్యలు రాకుండా సత్వర పరి‌ష్కారం చూపా‌లని కోరారు. కొన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సమ‌స్యల గురించి వివ‌రిం‌చారు. రాష్ర్టా‌నికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసు‌లను మరిన్ని ఇవ్వా‌లని విజ్ఞ‌ప్తి‌చే‌శారు. తెలం‌గా‌ణలో వ్యాక్సి‌నే‌షన్‌ ప్రక్రియ 90 శాతం లక్ష్యాన్ని చేరు‌కు‌న్న‌దని తెలి‌పారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్యా‌రో‌గ్య‌శాఖ కార్య‌దర్శి రిజ్వీ, డైరె‌క్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీని‌వా‌స‌రావు, కరోనా నిపు‌ణుల కమిటీ సభ్యులు గంగా‌ధర్‌ పాల్గొ‌న్నారు.

‘కొ‌విన్‌’ పరే‌షాన్‌!

దేశ‌వ్యా‌ప్తంగా శని‌వారం ప్రారం‌భ‌మైన కరోనా వ్యాక్సి‌నే‌షన్‌ ప్రక్రి‌యకు ‘కొ‌విన్‌ (కొ‌విడ్‌ వ్యాక్సిన్‌ ఇంటె‌లి‌జెన్స్‌ నెట్‌‌వర్క్‌) సాఫ్ట్‌‌వేర్‌ వల్ల సాంకే‌తిక సమ‌స్యలు ఎదు‌ర‌య్యాయి. రాష్ట్రంలో ఇటీ‌వల నిర్వ‌హిం‌చిన డ్రైరన్‌ సంద‌ర్భంగా కూడా 14 జిల్లాల్లో కొవిన్‌ సాఫ్ట్‌‌వేర్‌ వల్ల సమ‌స్యలు వచ్చాయి. దీనిపై కేంద్ర ఆరో‌గ్య‌శా‌ఖకు రాష్ర్టాల మంత్రులు ఫిర్యాదు చేసి‌న‌ప్ప‌టికీ ఫలితం లేకుం‌డా‌పో‌యింది. ఒక్కో లబ్ధి‌దా‌రుడి వివ‌రాలు నమోదు చేయడం, దానికి అప్రూ‌వల్‌ లభిం‌చడం, వ్యాక్సిన్‌ వేసిన తరు‌వాత వివ‌రాలు పొందు‌ప‌ర‌చ‌డా‌నికి ఎక్కువ సమయం పడు‌తు‌న్నది. రాష్ర్ట‌వ్యా‌ప్తంగా శని‌వారం 140 కేంద్రాల్లో జరి‌గిన వ్యాక్సి‌నే‌షన్‌ సంద‌ర్భంగా సాఫ్ట్‌‌వేర్‌ సమ‌స్యల వల్ల ప్రక్రియ ఆల‌స్య‌మైంది. కొన్ని‌చోట్ల సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొన‌సా‌గింది. కేవలం 30 మందికి వ్యాక్సిన్‌ వేయ‌డా‌నికే ఇంత సమయం పడితే, రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుం‌దని, అప్పుడు సమస్య మరింత జఠిలం అవు‌తుం‌దని వ్యాక్సిన్‌ సెంటర్ల సిబ్బంది ఆందో‌ళన వ్యక్తం‌చే‌స్తు‌న్నారు. దీనిపై అన్ని జిల్లా‌ల‌నుంచి ఇదే‌ర‌క‌మైన ఫిర్యా‌దులు వస్తు‌న్నాయి.

VIDEOS

logo