శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:00

నిమ్స్‌కు వచ్చేవారిని వెనక్కి పంపొద్దు: ఈటల

నిమ్స్‌కు వచ్చేవారిని వెనక్కి పంపొద్దు: ఈటల

హైదరాబాద్‌, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నిమ్స్‌కు వచ్చే ఏ ఒక్క రోగి వెనక్కి వెళ్లకూడదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై సంతోషంగా ఇంటికి వెళ్లేలా వైద్యులు చికిత్స చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. నిమ్స్‌లో వైద్యసేవలు మరింత మెరుగపడాలని ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ కార్యర్శి రిజ్వీ, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌, సూపరింటెండెంట్‌ సత్యనారాయణతోపాటు నిమ్స్‌లోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం రుమటాలజీ వైద్యసేవలు మరింత మెరుగుపడాలని సూచించారు. అవయవ మార్పిడి సమర్థంగా చేస్తున్న వైద్యులను అభినందించారు. గుండెరంధ్రాలు, చిన్న వయస్సులో కిడ్నీ సమస్యలు, బ్రెయిన్‌ హెమరేజ్‌ వంటి వాటికి చికిత్స అందించటం ద్వారా 70 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రోగికి, వారి సహాయకులకు వైద్యులు కౌన్సెలర్ల ద్వారా పరిస్థితిని వివరించాలని తెలిపారు.


logo