శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:38:36

సెకండ్‌ వేవ్‌ ఉండకపోవచ్చు: ఈటల

సెకండ్‌ వేవ్‌ ఉండకపోవచ్చు: ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/మాదాపూర్‌: కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ రాకకోసం ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ అండ్‌ ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌-2020 సదస్సులో మంత్రి ప్రసంగించారు. కొవిడ్‌ సోకినప్పటికీ రాష్ట్రంలో 99 శాతం మంది ఆరోగ్యంగా బయటపడ్డారని చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం విషయంలో సీఎం కేసీఆర్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పా రు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని, జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని సూచించారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఎంతో శ్రమించిందన్నారు. ప్రతిరోజూ 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని వివరించారు. పాఠశాలలు ప్రారంభించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ట్రెస్మా ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.