బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 12:19:39

వ్యాక్సినేష‌న్ నిరంత‌ర ప్ర‌క్రియ : మ‌ంత్రి ఈట‌ల‌

వ్యాక్సినేష‌న్ నిరంత‌ర ప్ర‌క్రియ : మ‌ంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్ : కొవిడ్ వ్యాక్సిన్ ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. గాంధీ ఆస్ప‌త్రిలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. ప్రారంభంలో ప్ర‌తి కేంద్రంలో 30 మందికి మాత్ర‌మే టీకాలు వేస్తామ‌న్నారు. వైద్యారోగ్య‌, పారిశుద్ధ్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అని పేర్కొన్నారు. తొలివిడ‌త‌లో పారిశుద్ధ్య సిబ్బందికి టీకా ఇవ్వాల‌ని ప్ర‌ధాని చెప్పారు. వ్యాక్సిన్ కోసం ఎవ‌రూ తొంద‌ర ప‌డొద్దు అని సూచించారు. ప్రాధాన్య‌క్ర‌మంలో అంద‌రికీ కొవిడ్ టీకాలు ఇస్తామ‌ని ఈట‌ల రాజేంద‌ర్‌ స్ప‌ష్టం చేశారు. 

శాస్ర్త‌వేత్త‌లు అహ‌ర్నిశ‌లు కృషి : కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

శాస్ర్త‌వేత్త‌లు అహ‌ర్నిశ‌లు కృషి చేసి కొవిడ్ టీకాను తయారు చేశార‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు కంపెనీల టీకాలు ప్ర‌స్తుతం వాడుక‌లోకి వ‌చ్చాయి. టీకాలు తెచ్చిన 4 కంపెనీల్లో రెండు మ‌న దేశంలోనే ఉత్ప‌త్తి అయ్యాయ‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ కూడా టీకా అందించింద‌ని తెలిపారు. క‌రోనా పోరులో ముందు నిలిచిన వారికే తొలి విడ‌త‌లో టీకాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ టీకా రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోసు తీసుకుంటేనే స‌త్ఫ‌లితాలు ఉంటాయ‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

VIDEOS

logo