గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 13:34:57

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి ఈటల

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కోఠి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంఈ రమేశ్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. పీపీ కిట్లు, శానిటైజేషన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించామని చెప్పారు. పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్‌, పారామెడికల్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. అవసరం లేని రోగులను ఆస్పత్రుల్లో ఉంచుకోవద్దు అని సూచించారు. ఒక్కో ప్రయివేటు ఆస్పత్రికి ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకు ఏం అవసరం ఉన్నా వాటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు మనమంతా సమాయత్తం కావాలని మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు.


logo
>>>>>>