ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 22:58:49

ధరణి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించిన మంత్రి ఈటల

ధరణి కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించిన మంత్రి ఈటల

హైదరాబాద్‌ :  బీఆర్‌కేఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్‌ రూమ్‌ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలించారు.  ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌, కంట్రోల్‌ రూమ్‌ పనితీరును సీఎస్‌ ఈటల రాజేందర్‌కు వివరించారు.  ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 8488 రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2285 రిజిస్ట్రేషన్లు చేసినట్లు వివరించారు. కామారెడ్డిలో 556, మెదక్‌లో 551,  రంగారెడ్డిలో 463, నల్గొండలో 446 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పటివరకు 75.70 లక్షల మంది ధరణి పోర్టల్‌ను వీక్షించారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 18.60 కోట్ల చెల్లింపులు జరిగాయని, 14,546 స్లాట్లు బుక్‌ చేసుకున్నారని మంత్రికి సీఎస్‌ వివరించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.