మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 13:18:31

‘రూర్బన్‌’పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

‘రూర్బన్‌’పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వరంగల్‌ రూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నరూర్బన్‌ పథకంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూర్బన్ పథకాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా పర్వతగిరి మండలంలో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు, రైతులకు సరైన అవగాహనా కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, కలెక్టర్‌ హరిత, డీఆర్డీఓ సంతప్‌రావు, ఆర్డీఓ మహేందర్‌తో పాటు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo