బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 18:19:07

సీఎం ఆదేశాల అమలుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

సీఎం ఆదేశాల అమలుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

హైదరాబాద్‌ : గ్రామాల అభివృద్ధికి కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన పలు అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాల అమలుపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా,కమిషనర్‌ రఘునందన్‌ రావుతో మంత్రి  సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆయా పనులు నిర్ణీత గడువులో సమర్థవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలే అధికారులకు విధి విధానాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. ఆయా పథకాల అమలు బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. నరేగాను వ్యూహాత్మకంగా వాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు.


logo