సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 13:49:02

పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్: సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ నెల 25లోపు అన్ని ప్రభుత్వ బడుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  పర్వతగిరి మండల కేంద్రంలో విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలను మంత్రి  పంపిణీ చేసి మాట్లాడారు.  కరోనా కారణంగా విద్యార్థులు చదువు నష్ట పోకుండా  ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్థుల చదువులకు నష్టం కలగకుండ TSAT చానల్ ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్  క్లాసులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.


logo