శనివారం 30 మే 2020
Telangana - May 08, 2020 , 11:07:52

ఉపాధిహామీ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ఉపాధిహామీ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ఆవుకుంట చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు పరిశీలించారు. దాదాపు 500 మంది కూలీలు చెరువులో ఉపాధి పనులు చేస్తున్నారు. పనులు సాగుతున్న తీరుపై ఆరా తీసిన మంత్రి కాసేపు వారితో కలిసి పనిచేశారు. ఉపాధి హామీ పనుల విషయమై వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరితతో మాట్లాడారు. ఎక్కువమందికి పని కల్పించాలని, కొత్తగా వచ్చిన కూలీలకు సైతం పనులు కల్పించాల్సిందిగా తెలిపారు. అడిగినవారందరికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 

logo