సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 13:11:36

హోటల్ వివేరా యజమాని వెంకట్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

హోటల్ వివేరా యజమాని వెంకట్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

హైదరాబాద్‌ : భువనగిరిలోని హోటల్ వివేరా యజమాని వెంకట్ రెడ్డి కుటుంబాన్నిపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వెంకట్ రెడ్డి తల్లి వజ్రమ్మ గత నెల 30న తన 92వ ఏట మరణించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.