గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 19:37:21

క‌రోనా పేషెంట్ల ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించిన మంత్రి ఎర్రబెల్లి

క‌రోనా పేషెంట్ల ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ : క‌రోనా బాధితుల ఇంటికెళ్లి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పరామర్శించారు. గ‌తంలో మంత్రులు కేటీఆర్, ఈట‌ల రాజేంద‌ర్ తో క‌లిసి పీపీఈ కిట్లతో వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్, మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ లో క‌రోనా వార్డుల్లోకి వెళ్లి రోగుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి ఈ రోజు నేరుగా క‌రోనా పేషంట్ల ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. క‌రోనా వైర‌స్ కి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌న్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఏ ఇబ్బందులూ ఉండ‌వ‌నే విష‌యాన్ని మర్చిపోవద్దన్నారు. జిల్లాలోని దేవ‌రుప్పుల మండ‌లం చిన్నమ‌డూరు సర్పంచ్ వంగా ప‌ద్మ, వెంకటేశ్వర్లు దంపతు‌ల‌ను మంత్రి వారి ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. 


logo