సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 15:38:32

కరోనా బాధితులతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి

కరోనా బాధితులతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి

నిర్మల్ : ఆరోగ్యం బాగుందా.. వైద్యం అందుతోందా.. మీరు అధైర్య పడొద్దు... మీకేం కాదు. కరోనాతో భయపడాల్సిందేమీ లేదు. ఒకరిద్దరికి తప్పా పెద్దగా ఇబ్బందులు ఏమీలేవు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఆదివారం వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్ కి మించిన, మంచి వసతులు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నాయన్నారు. మీకు ఏం కాదు నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. మరీ ఇబ్బందులు అనిపిస్తే చాలు నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయమని సూచించారు.

సీఎం, కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. 


logo