గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 11:04:36

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో బాపూజీ చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..స్వరాష్ట్ర సాధన, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం బాపూజీ ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను ఉంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. వారితో తెలంగాణ  ఉద్యమంలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.


logo