బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 19:06:53

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ :  తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పలుచోట్ల వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. రావురాయపర్తి మండలం గట్టికల్‌లో ఆయన బతుకమ్మను ఎత్తుకొని మహిళలతో కలిసి ఊరేగింపుగా బతుకమ్మ ఆడే ప్రదేశానికి చేరుకున్నారు. రాయపర్తి మండలం మైలారంలో బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబసభ్యులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్‌తో కలిసి బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవన విధానానికి బతుకమ్మ వేడుక అద్దం పడుతుందని అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మగౌరవానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి దృష్ట్యా మాస్కులు ధరించి, భౌతిక దూరం, పాటిస్తూ మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.