సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 10:58:38

'10 గంటలకు 10 నిమిషాలు' ను సామాజిక ఉద్యమంగా చేపట్టాలి

'10 గంటలకు 10 నిమిషాలు' ను సామాజిక ఉద్యమంగా చేపట్టాలి

హైదరాబాద్‌ : ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమానిన సామాజిక ఉద్యమంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు మంత్రి నేడు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దోమల నివారణతో మలేరియా, డెంగ్యూ వంటి అనేక వ్యాధులను రాకుండా నివారించొచ్చన్నారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ర్టాన్ని, దేశాన్ని రోగ రహితంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచొచ్చన్నారు. వీఐపీలే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారు.
logo