ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 17:08:30

జయప్రకాశ్‌ రెడ్డి మృతి ప‌ట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

జయప్రకాశ్‌ రెడ్డి  మృతి ప‌ట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

హైదరాబాద్ : విభిన్నమైన పాత్రలు, త‌న విలక్షణ న‌ట‌న‌తో అంద‌రినీ అల‌రించిన జ‌య‌ప్రకాశ్ రెడ్డి మృతి పట్ల పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు  తీవ్ర సంతాపం తెలిపారు. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్రవేశం చేసి అల‌వోక‌గా.. అత్యంత స‌హ‌జంగా జయప్రకాశ్‌ రెడ్డి న‌టించేవార‌ని మంత్రి అన్నారు. ప్రత్యేకించి రాయ‌ల‌సీమ యాస‌లో జేపీ డైలాగ్స్ సినీ ప్రేక్షకుల‌ను అల‌రించాయ‌న్నారు. జయప్రకాశ్‌ రెడ్డి  మ‌ర‌ణం చిత్ర పరిశ్రమకు తీర‌ని లోట‌ని మంత్రి పేర్కొన్నారు. ఆయ‌న కుటుంబానికి త‌న ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


logo