బీజింగ్ : బహు భార్యత్వానికి మద్దతుగా మాట్లాడిన ఓ న్యాయ కళాశాల ప్రొఫెసర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సదరు యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారు. కొంతమంది మేధావులకు బహుభార్యాత్వాన్ని పొందేందుకు అనుమతించాలని ఆయన ఇటీవల వీ చాట్‌లో సూచించడంతో ఈ సమస్య వచ్చి పడింది. ఈస్ట్ చైనా యూనివర్శిటీ ఆఫ్ పొలిటికల్ సైన్స్‌లో అంతర్జాతీయ చట్టాలను బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ బావో యినాన్ తన వీచాట్ వేదికగా చైనా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వివాహానికి సంబంధించి ప్రత్యేక హక్కులు ఉండాలని రాశారు.
ఈ నివేదికను హాంకాంగ్‌లోని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో సోమవారం ప్రచురించారు. ఆన్లైన్లో తప్పుడు ఆలోచనలు ఇచ్చినందున బావో యినాన్ను విధుల నుంచి తొలగించాలని ఇక్కడి టీచర్స్ వర్క్ యూనిట్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ యూనిట్ కమ్యూనిస్ట్ పార్టీ వర్క్ కమిటీ క్రింద పనిచేస్తుంది. బావో కన్నా ముందు బహు భార్యాత్వాన్ని ఏడాది క్రితం ఫుడాన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ యూ-క్వాంగ్ ఎన్జీ కూడా సమర్థించారు. దేశంలో లింగ అసమానత సమస్యను పరిష్కరించడానికి చైనా మహిళలను బహుళ వివాహాలు చేసుకునేందుకు అనుమతించాలని ఎన్జీ ప్రతిపాదించారు.
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్‌తో 168 ఎలుకలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..