మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 14:49:48

పర్వతగిరి మండల అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి శ్రీకారం

పర్వతగిరి మండల అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి శ్రీకారం

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండల అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు శ్రీకారం చుట్టారు. పర్వతగిరి మండలకేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం రూర్బన్‌ పథకంలో భాగంగా చేపట్టిన పర్వగిరి, అన్నారం ఊరచెరువు కట్టలను వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. రూర్బన్‌ ప్రాజెక్టు కింద మంజూరైన రూ.30 కోట్లతో పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. పర్వతగిరి మండల వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఖరారు చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, సంబంధిత అధికారులతో కలిసి ఆయా పనులపై మంత్రి స్వయంగా క్షేత్ర పరిశీలన చేశారు.logo