సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 14:08:04

సీఎం కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ రూరల్ : రాయపర్తి మండలంలోని కేశవపురం లో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కాట్రపల్లి లో రైతు వేదిక,పల్లె ప్రకృతి వనం, మొరిపిరాల(అర్ & అర్ కాలనీ) లో రైతు వేదిక, రాయపర్తిలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, పెర్కేడులో రైతు వేదిక, గ్రామపంచాయితీ షాపింగ్ కాంప్లెక్స్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఎర్రబెల్లి రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న‌ద‌ని తెలిపారు. రైతులకు సీఎం చేసినంతగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేదు. మన రాష్ట్రంలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో, మరే రాష్ట్రం లోనూ అమ‌లు కావ‌డం లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి అని మంత్రి ఉద్ఘాటించారు. సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి, రుణాల మాఫీ, పంటల కొనుగోలు... ఇలా 18 రకాల పథకాలు అమలు అవుతున్నాయి. రైతాంగానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. విద్యుత్ మీటర్లు బిగిస్తామని చెబుతున్నది. వ్యవసాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నది. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సూచించారు. 

ఈ కార్యక్రమాల్లో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వివిధశాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


logo