సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 12:07:41

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ : కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండలం కంటాయపాలెం గవర్నమెంట్‌ హై స్కూల్ లో బాల వికాస అధ్వర్యంలో  విద్యార్థులకు 40 ట్యాట్‌లు పంపిణీ చేశారు. అలాగే తొర్రూరు అతిథి గృహంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క‌రోనా వల్ల ఇప్పుడు డిజిట‌ల్, ఆన్ లైన్ క్లాసులు వ‌చ్చేశాయి. ఇప్పుడు గురువు క‌న‌బ‌డ‌కుండానే చ‌దువు నేర్చుకునే విధంగా పరిస్థితులు మారాయన్నారు.

కరోనా కష్టకాలంలో చ‌దువుల‌కు ఎవ‌రూ దూరం కావొద్దని బాల వికాస సంస్థ ట్యాబ్ లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అలాగే కరోనా కారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. కేవలం తెలంగాణలోనే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మనమంతా  అండగా ఉండాలన్నారు.  కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, పాల్గొన్నారు.