ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 16:09:58

ప్ర‌జ‌ల ఆస్తుల భ‌ద్ర‌త‌కే స‌ర్వే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

ప్ర‌జ‌ల ఆస్తుల భ‌ద్ర‌త‌కే స‌ర్వే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ రూర‌ల్ : ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆస్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకే ఆస్తుల న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌ని, ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. రాయ‌ప‌ర్తి మండ‌లంలోని రాగ‌న్న‌గూడెం గ్రామాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి శ‌నివారం సంద‌ర్శించి.. ఆస్తుల న‌మోదుకు సంబంధించిన అపోహాలు, అనుమానాల‌ను నివృత్తి చేసి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచారు.  

గ్రామ పంచాయ‌తీలో ఏర్పాటు చేసిన మైక్‌లో మంత్రి మాట్లాడుతూ.. నేను మీ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని...! మీ అభిమాన ఎమ్మెల్యేని... మంత్రిని...!! అంటూ ప్ర‌జ‌ల ఆస్తుల న‌మోదుపై వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌జ‌లంతా ద‌య‌న్నా! అని అభిమానంగా పిలుచుకునే మంత్రి నేరుగా త‌మ‌తో మాట్లాడుతుండ‌టంతో... ఒక్క‌సారిగా ప్ర‌జ‌లంతా అల‌ర్ట్ అయ్యారు. మంత్రి చెప్పే మాట‌ల‌న్నీ సావ‌ధానంగా విన్నారు.  

ప్ర‌జ‌ల ఆస్తుల న‌మోదు కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. భ‌ద్ర‌త‌, భ‌రోసా, ఆస్తుల విలువ‌ను పెంచ‌డం కోస‌మే సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ఆస్తుల‌ను న‌మోదు చేయాల‌ని నిర్ణ‌యించార‌న్నారు. ప్ర‌జ‌లు ఎలాంటి అనుమానాలు, అపోహ‌లున్నా తొల‌గించ‌కోవాల‌ని చెప్పారు. అలాగే, గ్రామంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మంచి స్థానాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చార‌ని, ప్ర‌జ‌ల అభివృద్ధికే తాను పాటుప‌డ‌తాన‌ని మంత్రి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటే మంత్రి, ఇలా త‌మ‌తో మ‌మేకం అవ‌డంతో ఆ గ్రామ ప్ర‌జ‌ల ఎంతో సంతోషించారు.

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌జ‌ల ఆస్తులను న‌మోదు చేస్తున్న అధికారుల‌తో మంత్రి ద‌యాక‌ర్‌రావు మాట్లాడారు. న‌మోదు ఎలా జ‌రుగుతుంది? ప్ర‌జ‌ల స‌హ‌కారం ఎలా ఉంది? న‌మోదు పూర్త‌వ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అ‌ని మంత్రి అడిగారు.  


logo