శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 11:06:30

పెన్ష‌న్లు ఇస్తున్న‌ది రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

పెన్ష‌న్లు ఇస్తున్న‌ది రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ : రాష్ర్టంలో పెన్ష‌న్లు కేంద్రమే ఇస్తోంద‌ని బీజేపీ నాయ‌కులు అపోహ‌లు సృష్టిస్తున్నారు. పెన్ష‌న్లు ఇస్తున్న‌ది రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే అని ఘంటాప‌థంగా చెప్తున్నామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆస‌రా పెన్ష‌న్ల ప‌థ‌కానికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ‌లో పెన్ష‌న్‌దారులంద‌రూ కేసీఆర్ ను పెద్ద‌కొడుకుగా భావిస్తున్నారు. కేసీఆర్ ను ఎంతో గొప్పగా గౌర‌విస్తున్నార‌ని తెలిపారు. ఆస‌రా పెన్ష‌న్ల ప‌థ‌కం కింద ఈ ఏడాది ఆగ‌స్టు చివ‌రి నాటికి 38,32,801 మందికి ల‌బ్ధి చేకూరింద‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కానికి ఇప్ప‌టి వ‌ర‌కు 31,902 కోట్ల 91 ల‌క్ష‌ల మొత్తాన్ని ఖ‌ర్చు చేసింద‌ని తెలిపారు. ఆస‌రా పెన్ష‌న్ ప‌థ‌కానికి 65 ఏళ్ల నుంచి 57 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గిస్తామ‌న్న ప్ర‌తిపాద‌న సీఎం కేసీఆర్ ప‌రిశీల‌న‌లోఉంద‌ని మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మ‌డి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి పెన్ష‌న్ల‌కు 800 కోట్లు ఖ‌ర్చు పెడితే.. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత 11,725 కోట్లు పెన్ష‌న్ల‌కు ఖ‌ర్చు పెడుతున్నాం. ఒక నెల‌కు 977 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రం సంవ‌త్స‌రానికి 210 కోట్లు మాత్ర‌మే పెన్ష‌న్ల‌కు ఇస్తుంది. గ‌తంలో వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇచ్చే వారు. ఇప్పుడేమో వీరితో పాటు చేనేత‌, క‌ల్లుగీత, బీడీ కార్మికుల‌తో పాటు ఒంట‌రి మ‌హిళ‌ల‌కు, హెచ్ఐవీ, మ‌లేరియా వ్యాధిగ్ర‌స్తుల‌కు కూడా ఆస‌రా పెన్ష‌న్ల ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేశామ‌న్నారు. మ‌ర‌గుజ్జుల‌కు కూడా పెన్ష‌న్ ఇచ్చే విష‌యం ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. 


logo