శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 11:52:49

కేంద్ర విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

కేంద్ర విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లాలోని పోచ‌మ్మ మైదాన్‌లో 3311 కేవీ విద్యుత్ స‌బ్‌స్టేష‌న్ ఏర్పాటుకు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల బిల్లును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్ర‌యివేటీక‌ర‌ణ చేస్తే అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డుతాయ‌న్నారు. రైతుల‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. రైతుల‌కు మేలు చేసేలా చ‌ట్టాలు తీసుకురావాల‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెవెన్యూ చ‌ట్టంతో రైతులంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి స్ప‌ష్టం చేశారు. 


logo