మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 17:42:16

ఫ్యామిలీతో క‌లిసి వ్య‌వ‌సాయ క్షేత్రంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

ఫ్యామిలీతో క‌లిసి వ్య‌వ‌సాయ క్షేత్రంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వ‌రంగ‌ల్ : క‌రోనా క‌ట్ట‌డిలో స్వీయ నియంత్ర‌ణ‌తో సొంతూళ్ళోనే గడుపుతున్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌రావు. నిన్న ఆదివారం త‌న మ‌న‌వ‌డు కార్తీక్ పుట్టిన రోజున కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్యే కేక్ క‌ట్ చేయించిన మంత్రి, సోమ‌వారం కుటుంబ స‌భ్యులంద‌రినీ తీసుకొని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రానికి వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ క్షేత్రంలోని పంట‌ల‌ను త‌న కుటుంబ స‌భ్యుల‌కి చూపించారు. మ‌న‌వ‌డు కార్తీక్‌ ట్రాక్ట‌ర్ న‌డిపి బుర‌ద పొలాన్ని దున్నారు. అలాగే చేల‌కు పురుగుల మందును పిచికారీ చేశారు. వ‌న‌వ‌ళ్ళు మ‌న‌వ‌రాళ్ళు అంతా క‌లిసి ఉత్సాహంగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి స్వ‌యంగా త‌న పాత‌కాలం జీపుని న‌డుపుతూ, వెనుక ట్రాలీని అమ‌ర్చి కుటుంబ స‌భ్యుల‌ను అందులో తీసుకెళ్ళారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, క‌రోనా ఇబ్బందులున్న‌ప్ప‌టికీ, ఈ క‌ష్ట‌కాలంలోనూ కుటుంబంతో గ‌డిపే అరుదైన అవ‌కాశాలు ల‌భిస్తున్నందుకు ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న 40ఏండ్ల రాజ‌కీయ జీవితంలో ప్ర‌జ‌ల‌తోనే గ‌డుస్తున్న‌ద‌న్నారు. త‌న తండ్రిగారు స‌ర్పంచ్‌గా ప‌ని చేసిన స‌మ‌యం నుంచే తాను ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉండ‌డాన్ని అల‌వాటు చేసుకున్నామ‌న్నారు. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ప్రజా జీవితంలోనే, వారికి సేవచేస్తూ గ‌డుపుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. అయితే, క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలోనూ తాను ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నాన‌ని, వారికి ధైర్యం చెబుతూ, అధికారుల‌తో క‌రోనా విస్తృతి నివార‌ణ చ‌ర్య‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌ల‌ను క‌ష్ట‌కాలంలో ఆదుకోవ‌డానికి నేత‌లు ముందుండాల‌ని చెప్పారు. నిజ‌మైన ప్ర‌జాసేవ చేసే అరుదైన అవ‌కాశం దొరికింద‌న్నారు.  ఇలా దొరికిన స‌మ‌యాన్ని కుటుంబంతో గ‌డుపుతున్నామ‌న్నారు. ఇలాగే, ప్ర‌జ‌లంతా కూడా స్వీయ నియంత్ర‌ణ‌తో ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్ళొద్ద‌ని, ఎవ‌రి ఇండ్ల‌ల్లో వాళ్ళే ఉండాల‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. 


logo