గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 19:50:54

అనుమానితులు వెంటనే క్వారంటైన్‌ సెంటర్లలో చేరాలి

అనుమానితులు వెంటనే క్వారంటైన్‌ సెంటర్లలో చేరాలి

ప‌ర్వ‌త‌గిరి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా:   క‌రోనా వైర‌స్ దాదాపు క‌ట్ట‌డి అయిన త‌రుణంలో ఢిల్లీ జ‌మాత్ కు వెళ్ళి వ‌చ్చిన వాళ్ళ‌ల్లో కొంద‌రికి పాజిటివ్ వ‌చ్చింద‌న్న వార్త‌లు ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా లేని వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలోనూ పాజిటివ్ కేసుల క‌ల‌క‌లం ప్ర‌జ‌ల్లో భాయందోళ‌న క‌లిగిస్తుంద‌ని తెలిసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వెంట‌నే రంగంలోకి దిగారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా క‌లెక్ట‌ర్లు, వైద్య‌, పోలీసు అధికారుల‌తో వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా తానుంటున్న ప‌ర్వ‌త‌గిరి నుంచి టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తాజా ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. సహ‌నం, సంయ‌మ‌నంతో ప‌ని చేయాల‌ని వారికి దిశానిర్దేశం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాలో ఒక్క క‌రోనా కేసు లేక‌పోవ‌డ‌మేగాక‌, ప్ర‌జ‌ల సంక్షేమార్థం ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఇచ్చిన పిలుపు మేర‌కు ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జ‌లు లాక్ డౌన్ ని సీరియ‌స్ గా పాటిస్తున్నారు. అయితే, కొంద‌రు ఢిల్లీలో జ‌రిగిన జ‌మాత్ కి హాజ‌రై గుట్టు చ‌ప్పుడు కాకుండా, వారి ఇళ్ళ‌కు చేరార‌ని, వాళ్ళంద‌రినీ గుర్తించి, వెంట‌నే ప్ర‌భుత్వ క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. అయితే వాళ్ళ‌ల్లో కొంద‌రికి ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌న‌ప్ప‌టికీ, పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌తో ప్ర‌జ‌లు భాయందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ప‌రీక్ష‌ల‌కు, చికిత్స‌ల‌కు, క్వారంటైన్, ఐసోలేష‌న్ వంటి అన్ని చ‌ర్య‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.

భ‌యంతో జీవితంలో దేన్నీ ఎదుర్కోలేమ‌ని, దేన్నైనా స‌రే, చివ‌ర‌కు క‌రోనా వైర‌స్ నైనా అప్ర‌మ‌త్త‌త‌, ఆత్మ‌నిబ్బరంతో గెలువ వ‌చ్చ‌న్నారు. అనుమానితులు వెంట‌నే ప్ర‌భుత్వ క్వారంటైన్ సెంట‌ర్ల‌కు చేరాల‌ని, స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు. ఒక‌వేళ అలా ముందుకు రాని వాళ్ళ‌ని ఎక్క‌డున్నా, ఎంత‌టి వారైనా గుర్తించి, వాళ్ళ‌ని క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు సూచించారు. సున్నిత‌మైన ఈ సంద‌ర్భంలో అధికారులు, పోలీసులు, వైద్యులు అవ‌స‌ర‌మైతే కాస్త క‌ఠినంగా, బాధితుల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం పెంచుతూ వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు చెప్పారు.  క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు లాక్ డౌన్ త‌ప్ప మ‌రోదారి లేద‌ని, పాజిటివ్ వ‌చ్చిన వాళ్ళ‌కి త‌గిన ఏర్పాట్లు, చికిత్స మ‌న వ‌ద్ద అందుబాటులో ఉంద‌ని చెప్పారు. అందుకే పాజిటివ్ వ‌చ్చిన అనేక‌ మంది కోలుకొని డిశ్చార్జీ కూడా అవుతున్నార‌న్నారు.

ప్ర‌పంచ‌మే గ‌డ‌గ‌డ‌లాడుతున్న‌త‌రుణంలో దార్శ‌నికులైన మ‌న సీఎం కెసిఆర్ ముందు చూపుతో దేశానికంటే ముందే మ‌నం మేల్కొని లాక్ డౌన్ ని ప్ర‌క‌టించి స్వ‌యం నిర్బంధం, స్వీయ నియంత్ర‌ణ‌లోకి వెళ్ళామ‌ని, అదే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష‌గా నిలిచింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా నిర్మూల‌న‌లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయ‌తీ సిబ్బంది, అధికారులు మ‌న కోసం త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్నార‌ని, వాళ్ళ‌కు స‌హ‌క‌రించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా నిర్మూల‌న జ‌రిగే వ‌ర‌కు లాక్ డౌన్ ని కొన‌సాగిద్దామ‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ సంక‌ల్పానికి మ‌న స‌హ‌నం తోడ‌వ్వాలి. మ‌నతోపాటు దేశ‌మంతా బాగుండాలి.  సంఘ‌టితంగా పోరాడుదాం...క‌రోనాని స‌మూలంగా నిర్మూలిద్దాం అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు చెప్పారు.


logo