శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 13:13:36

హన్మకొండలో శానిటైజేషన్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండలో శానిటైజేషన్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ అర్బన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు హన్మకొండలో శానిటైజేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక అశోకా జంక్షన్‌లో రసాయనాల పిచికారిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా క్రిమి సంహారక రసాయనాల పిచికారీని విస్తృతంగా చేపట్టిన విషయం తెలిసిందే. సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రేతో పాటు డీజిల్‌లో కలిపి మెలాథియన్‌ను విస్తృతంగా ఫాగింగ్‌ చేస్తున్నారు.logo