గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 17:55:42

రోడ్ల‌పై కుప్ప‌లు, తెప్ప‌లకి‌క చెల్లు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు

రోడ్ల‌పై కుప్ప‌లు, తెప్ప‌లకి‌క చెల్లు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు

మ‌హ‌బూబాబాద్ : రోడ్ల‌పై కుప్ప‌లు, తెప్ప‌లకి‌క చెల్లు అని ఇక‌పై రైతులు చేను, చెల‌క‌ల్లోనే ధాన్యం ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దాయ‌క‌ర్‌రావు అన్నారు. మ‌హబూబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని చిన్న వంగర గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు కల్లాన్ని మంత్రి శ‌నివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు క‌ళ్ళ‌ల్లో క‌ల్లాల వెలుగులు వెల్లివిరుస్తున్నాయ‌న్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ని తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రైతుల‌కు రాష్ట్రంలో ల‌క్ష క‌ల్లాల‌ను మంజూరు చేసిందన్నారు. రైతులు ఎవ‌రి చెల‌క‌ల్లో, పొలా‌ల్లో వారు క‌ల్లాలు నిర్మించుకోవాలని అవ‌స‌ర‌మైన నిధులు కూడా కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే పూర్త‌వ్వాల్సిన క‌ల్లాలు క‌రోనా, పంటల సీజన్ కార‌ణంగా ఆల‌స్యంగా మొద‌ల‌య్యాయన్నారు.

భూ క‌మ‌తాలు చిన్న‌వ‌వ‌డం వల్ల రైతులకు పండిన పంటను ఎక్కడ పెట్టాలో తెలియ‌క పంట నష్టం జరిగేది. కల్లాలు లేక రైతులు తమ పంటలను రోడ్ల మీద ఆరబెట్టుకోడం, నూర్పిల్లు వంటి అన్ని కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ చర్యల వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. పైగా అందరికీ అన్నం పెట్టే రైతన్న రోడ్లను కల్లాలుగా ఉపయోగించడం ఆత్మగౌరవంగా కూడా ఉండటం లేద‌న్నారు. రాష్ట్రంలో రైతులను రాజులను చేయాలని సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.రైతులు కల్లాల‌ను నిర్మించుకునే అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. అధికారులు కూడా స్వయంగా క్షేత్ర పర్యవేక్షణ చేస్తూ కల్లాలను వేగంగా నిర్మాణం జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు.