గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 01:22:11

ప్రతినెలా పింఛన్లకు రూ.879 కోట్లు

ప్రతినెలా పింఛన్లకు రూ.879 కోట్లు
  • అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో 38,77,717 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారని, పింఛన్లకోసం ప్రతినెలా రూ.879 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, కే చందర్‌ అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. ఈ నెల తర్వాత వృద్ధాప్య పింఛ న్‌ వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామని తెలిపారు. దీనివల్ల మరో 6.62 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారన్నారు. 


సంస్కరణలతో పెరిగిన ఆదాయం

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 


సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఎైక్సెజ్‌శాఖకు ఆదాయం పెరిగిందే తప్ప మద్యం దుకాణాలను పెంచడం ద్వారా కాదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టంచేశారు. పన్నులను హేతుబద్ధీకరించడం వల్ల ఆదాయం రెండింతలు అయిందన్నారు. 


మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు

  • మంత్రి గంగుల కమలాకర్‌


రైతులకు మద్దతు ధర రాలేదని ఒక్కచోట కూడా ఫిర్యాదులు రాలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వానకాలం పంట కోసం 3,670 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 47.11 లక్షల టన్నుల ధాన్యా న్ని మద్దతు ధరకు కొన్నామన్నారు. 7,12,344 మంది రైతులకు రూ.8,677 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 


logo