గురువారం 02 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:36:02

జూలై 30 నాటికి ఇంటింటికీ తాగునీరు

జూలై 30 నాటికి ఇంటింటికీ తాగునీరు

నీలగిరి : జూలై 30 నాటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా గడపగడపకూ తాగునీరందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఎమ్మెల్యేలతో కలిసి మిషన్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రూ. 40,123 కోట్లతో ప్రారంభించిన మిషన్‌ పనులను జూలై 30 లోగా పూర్తిచేస్తామన్నారు. మిషన్‌ భగీరథ విజయంతో ఈ ఐదేళ్లలో ఒక్క ఫ్లోరైడ్‌ కేసు నమోదు కాలేదన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో పర్యటించారనీ, రాష్ట్రం సిద్ధించాక కష్టాలు తీర్చారన్నారు.


logo