శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 02:56:10

గోదావరితో సస్యశ్యామలం

గోదావరితో సస్యశ్యామలం

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
  • ధర్మసాగర్‌ నుంచి నీటి విడుదల 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రూ. 30 వేల కోట్లతో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణేనని, ఇదే సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. గురువారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ రాజయ్య, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి నీటిని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం, దేవాదుల సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందించి సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ కింద పరకాల, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో రూ.78.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సౌత్‌ కెనాల్‌ ద్వారా 33 గ్రామాల్లోని 91,700 ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు చెప్పారు. 38 టీఎంసీల సామ ర్థ్యం గల దేవాదుల ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ 60 టీఎంసీలకు పెంచడమే కాకుండా 365 రోజులు మోటర్ల ద్వారా లిఫ్ట్‌ చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో దేవాదుల ప్రాజెక్టు సీఈ కే బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. 
logo