బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 19:00:20

మంత్రి ఎర్ర‌బెల్లి ఇంటి వివ‌రాల న‌మోదు

మంత్రి ఎర్ర‌బెల్లి ఇంటి వివ‌రాల న‌మోదు

వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కుటుంబ వివ‌రాల‌తో పాటు, ఆస్తుల వివ‌రాల‌ను కూడా త‌ప్ప‌కుండా న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్ లోని త‌న ఇంటి వివ‌రాల‌ను మంత్రి వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేషన్‌లో ఆదివారం న‌మోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి స్వ‌యంగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ నాగేశ్వ‌ర‌రావుకి అంద‌చేశారు. వాటిని ధ‌ర‌నీ పోర్టల్‌లో న‌మోదు చేయాల్సిందిగా కోరారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూత‌న రెవిన్యూ చ‌ట్టంలో భాగంగా భూ వివాదాల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నంలోనే ప్ర‌జ‌ల ఆస్తుల న‌మోదుని కూడా సీఎం కేసీఆర్ చేప‌ట్టార‌న్నారు. వ్య‌వ‌సాయ భూముల త‌ర‌హాలోనే, వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు కూడా పట్టాపాసు పుస్త‌కాలు ఇవ్వాల‌ని సీఎం త‌ల‌పోస్తున్న‌ట్లు చెప్పారు. ఈ పాసు పుస్త‌కం వ‌ల్ల‌, ప్ర‌జ‌ల ఆస్తుల‌కు భ‌ద్ర‌త క‌లిగి, విలువ‌లు పెరుగుతాయ‌న్నారు. ప్ర‌జ‌లంతా త‌మ త‌మ ఆస్తుల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, పంచాయ‌తీ, కార్పొరేష‌న్ల సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని మంత్రి కోరారు. 


logo