మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:28:27

పారిశుద్ధ్యం మెరిసె.. పల్లె మురిసె

పారిశుద్ధ్యం మెరిసె.. పల్లె మురిసె

  • 8 రోజులు.. 7 ప్రాథమ్యాలు
  • సర్కారు కార్యక్రమంతో సత్ఫలితాలు
  • విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి నివారణే లక్ష్యంగా ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు సాగిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. సర్కారు చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడంతో గ్రామీణులు మురిసిపోతున్నారు. 8 రోజు లపాటు ఏడు అంశాలను ప్రాథమ్యాలుగా తీసుకొని చేపట్టిన పారిశుద్ధ్య పనులు సత్ఫలితాలను ఇచ్చాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని 90 శాతానికి మించి చేరుకోగలిగామన్నారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో కార్యక్రమం ప్రారంభానికి ముందే వీడియో, టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులను అప్రమత్తం చేశారు. 12,766 గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించగా, వీటిల్లో భౌతికదూరం పాటిస్తూ 1,75,485 మంది పాల్గొన్నారు. 12,751 పంచాయతీల్లో పాదయాత్రలుచేసి సమస్యలు పరిష్కరించారు.  


logo