సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 13:19:04

యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు : మంత్రి ఎర్రబెల్లి

యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : ఆచార్య కొత్తపల్లి జయంశకర్‌ సార్‌ తన యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. నేడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి నేడు. ఈ సందర్భంగా మంత్రి జయశంకర్‌ సార్‌కు ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. జయశంకర్‌ సార్‌ బాట భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకమన్నారు. ఆజన్మ బ్రహ్మచారిగా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. జయశంకర్‌ సార్‌ నడుస్తున్న తెలంగాణ చారిత్రక గ్రంథంగా ఉండేవారన్నారు. 


logo