బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 20:08:55

ఇంతగొప్ప బడ్జెట్‌ ఎప్పుడూ చూడలేదు...

ఇంతగొప్ప బడ్జెట్‌ ఎప్పుడూ చూడలేదు...

జనగామ జిల్లా:  సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రూపొందించి బడ్జెట్‌ చూసి విపక్షాలకు ఏం చేయాలో అర్థంకాక పిచ్చి పట్టి అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బడ్జెట్‌లో పేద రైతులకు పెద్దపీట వేశారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండగ చేశారు. కేసీఆర్‌ లాంటి సీఎంను, ఇంత మంచి బడ్జెట్‌ను నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో చూడలేదని తెలిపారు. సందర్భంగా లేకుండా విమర్శించే వారికి ప్రజలు విలువ ఇవ్వరని గుర్తు చేశారు. రైతే రాజు అన్నోల్లే కానీ రైతు సంక్షేమం  గురించి పట్టించుకున్నవాళ్లే లేరు.  రైతు సంక్షేమం, రైతులు బాగుపడాలనే తపన ఉన్న సీఎం కేసీఆర్‌కు తప్ప ఇంకెవ్వరిలో చూడలేదన్నారు.

అనుకున్నది సాధించాలనే పట్టుదలతో సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, మిషన్‌ కాకతీయ, తాగునీటి కోసం మిషన్‌ భగీరథ పథకాలతో కేసీఆర్‌ తెలంగాణ పాలిట అపర భగీరథుడు అయ్యారన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు వేదికల కోసం భారీగా నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మేలు జరుగుతుంటే, రైతు సంక్షేమాన్ని వ్యతిరేకించేవాళ్లు ప్రజాసేవకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని, సీఎం కేసీఆర్‌ను విమర్శించేవాళ్లకు అధికారం దూరమై భవిష్యత్తు అంధకారమై దిక్కుతోచక పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికార దాహంతో మతిభ్రమించి చేసే ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని తేల్చి చెప్పారు. 


logo