గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 01:17:27

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలవి పిచ్చిమాటలు

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలవి పిచ్చిమాటలు

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు: లాక్‌డౌన్‌ కారణంగా సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మద్దతు ధరకు పంటలను కొంటున్నా.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో రైతులకు సబ్సిడీ జీలుగ విత్తనాలు పంపిణీ చేసి, మాట్లాడారు.  బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో ఏమేరకు ధాన్యం కొనుగోలు చేశారో తెలుపాలని మంత్రి ప్రశ్నించారు. విపత్తు కాలంలోనూ పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.logo