శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 12:07:45

కష్ట కాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన ఆప్తులు: ఎర్రబెల్లి

కష్ట కాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన ఆప్తులు: ఎర్రబెల్లి

మహబూబాబాద్‌: జిల్లాలోని తొర్రూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వివిధ సేవాసంస్థలు, పలువురు దాతల సహాకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అమ్మాపురంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా వంటి కష్టకాలంలో నిరుపేదలను ఆదుకోవడానికి ఇంత మంది దాతలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. 

కష్టకాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన ఆప్తులు. కరోనా కష్టాలు తీరే వరకు ప్రజలు ఒకరినొకరు ఆదుకోవాలి. సీఎం కేసీఆర్‌ స్పూర్తిగా మనమంతా ప్రభుత్వానికి, ప్రజలకు బాసటగా నిలవాలి. అయినా పేదల సంక్షేమాన్ని, ప్రజలందరి సంక్షేమాన్ని కోరి సీఎం అనేక సహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బియ్యం, ఆర్థిక స‌హాయం, పంట‌ల పెట్టుబ‌డులు, రుణ మాఫీలు, రైతుల పంట‌ల కొనుగోలు వంటి అన్ని కార్య‌క్ర‌మాలు చేస్తున్నారని తెలిపారు. 


logo