సోమవారం 01 జూన్ 2020
Telangana - May 01, 2020 , 11:15:10

ప్రజలంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

ప్రజలంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

జనగామ: జిల్లాలోని పాలకూర్తి మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయాల మార్కెట్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక రైతు సేవా సహాకారం సంస్థ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఏమైనా నష్టం జరిగిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. 

అఖరు గింజ వరకు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు ఆందోళన చెందవద్దని, బౌతిక దూరం పాటించి ధాన్యం అమ్మకం పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాయపర్తి మండలం కొలన్‌పల్లె, మైలారం గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కష్టకాలంలో పేదలను, ప్రజలను, రైతులను ఆదుకున్న వాళ్లే నిజమైన సేవకులు. దానం చేసేవాడే మనసున్న మహారాజు. సీఎం కేసీఆర్‌ ఆర్థిక సమస్యలను లెక్క చేయకుండా, పేదలను, రైతులను ఆదుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్‌ ఔదార్యాన్ని ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఒకరికొకరు అదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 


logo