సోమవారం 01 జూన్ 2020
Telangana - May 02, 2020 , 19:32:04

విరాళాలు సేక‌రించి నిరుపేద‌ల‌ను ఆదుకోండి...

విరాళాలు సేక‌రించి నిరుపేద‌ల‌ను ఆదుకోండి...

హైద‌రాబాద్:  ప్ర‌జాప్ర‌తినిధులూ... ప్ర‌జ‌ల‌కు అండగా నిల‌వండి.  దాత‌ల‌ను సంప్ర‌దించి, వారితో విరాళాలు సేక‌రించి, నిరుపేద‌ల‌ను ఆదుకోండి. ఎన్ని క‌ష్టాల‌కైనా ఓరుద్దాం.. మ‌న ప్ర‌జ‌ల్ని మ‌నం ర‌క్షించుకుందామ‌ని సీఎం కేసీఆర్ అంటున్నారు. సిఎం గారి ఆలోచ‌న‌ల మేర‌కు ప‌ని చేయండి అంటూ...రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌ల‌‌కు పిలుపునిచ్చారు. ఇద్ద‌రు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు త‌దిత‌ర స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ,  సాధార‌ణ ప‌రిస్థితుల్లో ఏప్రిల్ నెల‌లో 12ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేసేది...క‌రోనా అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ఈ ఏప్రిల్ నెల‌లో 24 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది. ప్ర‌తి రోజూ ల‌క్షా 50వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తున్న‌ది. ఇంత చేస్తున్నా...గ‌తంలో కంటే కాళేశ్వ‌రం సాగునీటి కార‌ణంగా అధిక దిగుబ‌డులు వచ్చాయి. హ‌మాలీలు, గ‌న్నీ బ్యాగులు, ర‌వాణా స‌దుపాయాలు, గోదాములు వంటి అనేక స‌మ‌స్య‌లున్నా కావాల్సిన దానిక‌న్నా డ‌బుల్ చేస్తున్నాం. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పండి. అని మంత్రులు అన్నారు. 

ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్నంత‌గా గ‌తంలో ఏ ప్ర‌భుత్వమూ చేయ‌లేదు. అందుబాటులో నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, రైతు బంధు, రుణ విముక్తి, వ‌డ్డీ ర‌హిత రుణాలు, మ‌ద్దతు ధ‌ర‌తో ధాన్యం కొనుగోలు దాకా, దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నంత సీఎం కేసీఆర్ చేస్తున్నారు.రూ.30వేల కోట్ల అప్పుతో రైతుల వ‌ద్ద ధాన్యాన్ని కొంటున్నారు. రైతులు పండించిన ఆఖ‌రు గింజ వ‌ర‌కు కొనుగోలు చేస్తామ‌ని రైతుల‌కు వివ‌రంగా చెప్పండి అని మంత్రులు పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌ల‌కు సూచించారు. ఈ స‌మ‌యంలోనే పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, శ్రేణులు... ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వానికి వార‌ధులు కావాలి. ప్ర‌జ‌ల గుండెల్లో పార్టీని, ప్ర‌భుత్వాన్ని నిల‌పండి. అని వారు క‌ర్త‌వ్య బోధ చేశారు. క‌రోనా క‌ష్ట‌ కాలంలో ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాలి.దాత‌ల‌తో విరాళాలు సేక‌రించి నిరుపేద‌ల‌ను ఆదుకోవాలి. ఎన్ని న‌ష్టాల‌కైనా ఓరుద్దాం... ప్ర‌జ‌ల్ని ర‌క్షించుకుందామ‌ని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు.

ప్ర‌భుత్వ సాయం అంద‌రికీ అందేలా చూడండి. రైతులు న‌ష్ట పోకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకునేలా స‌మ‌న్వ‌యం చేయాల‌ని చెప్పారు. అలాగే, వ‌ల‌స కూలీల‌ను వారి సొంత ఊళ్ళ‌కు త‌ర‌లించ‌డంలో స‌మ‌స్య‌లుంటే తొల‌గించాల‌ని చెప్పారు.  టెలీ కాన్ఫ‌రెన్సులో... రైతు బంధు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎంపీలు బండ ప్ర‌కాశ్,  ప‌సునూరి ద‌యాక‌ర్, ఎమ్మెల్సీలు‌ క‌డియం శ్రీ‌హ‌రి, బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య, జ‌న‌గామ జెడ్పీ చైర్మ‌న్ పాగాల సంప‌త్ రెడ్డి, ప‌లు రైతు సేవా స‌హ‌కార సంస్థ‌ల చైర్మ‌న్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo