ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 11:58:59

నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన బస్వరాజు సారయ్య, గోరెటి వెంకన్న, దయానంద్ నేడు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు బంగారు తెలంగాణ సాధనలో అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆకాంక్షించారు. ఈ ఎమ్మెల్సీల రాకతో ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.