సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 12:42:14

స్నికితారెడ్డిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి

స్నికితారెడ్డిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : నీట్ ప‌రీక్షల్లో సౌత్ ఇండియాలో మొద‌టి ర్యాంక్, ఆల్ ఇండియాలో 3వ ర్యాంక్‌తో సత్తా చాటిన వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన స్నికితారెడ్డిని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అభినందించారు. హైద‌రాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో త‌న‌ను క‌లిసిన స్నికితారెడ్డి తల్లిదండ్రులు డాక్టర్ స‌దానంద‌రెడ్డి, డాక్టర్‌ ల‌క్ష్మితో మంత్రి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రం విద్యారంగంలో ముందుకెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నార‌న్నారని ప్రశంసించారు.