సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 13:20:38

క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు : మ‌ంత్రి ఈట‌ల‌

క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు : మ‌ంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌ను మంత్రి ఈట‌ల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా వ్యాపించ‌కుండా మార్చి 14న పాక్షిక లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించామ‌న్నారు. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌చ్చిన వారిని వెంట‌నే ఐసోలేష‌న్ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితిని సీఎం కేసీఆర్ నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. రాష్ర్టంలోనే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రోజుకు 60 వేల క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం. వ్యాధి తీవ్రత త‌క్కువ ఉన్న‌వారికి హోంఐసోలేష‌న్‌లోనే చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారికి ఆస్ప‌త్రుల్లో చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. క‌రోనా క‌ట్ట‌డిలో తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. క‌రోనా మ‌ర‌ణాల్లో దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది అని ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. 


logo