ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 18:57:40

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగాం: మంత్రి ఈటెల

 రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగాం: మంత్రి ఈటెల

హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని చెప్పారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్‌ కరోనాపై సమీక్ష చేస్తున్నారని విలేకరుల సమావేశంలో మంత్రి వివరించారు. 

'గాంధీ, ఉస్మానియాలో అన్ని సేవలు కొనసాగుతాయి. పాజిటివ్‌ కేసులు వచ్చిన ఇళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని సేవలు కొనసాగించాలని సూచించాం. కరోనా పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదు.  75ఏళ్లు దాటిన వ్యక్తి, డయాలసిస్‌ రోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్నారు. కరోనా సోకిన గర్బిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  మన వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.' అని చెప్పారు. 

'కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం. సూర్యాపేట, వరంగల్‌(అర్బన్‌), నిజామాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. కంటైన్మెంట్‌ జోన్లలో కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మాత్రమే రెడ్‌జోన్లుగా ఉన్నాయని' మంత్రి పేర్కొన్నారు.  logo