సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:04

సవాళ్లనుంచే అవకాశాలు

సవాళ్లనుంచే అవకాశాలు

  • వెబినార్‌లో కేంద్రమంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ పిలుపునిచ్చారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ‘విజయ్‌ భారత్‌ అభియాన్‌' పేరుతో రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ఆదివారం ఢిల్లీనుంచి వెబినార్‌లో ఆయన ప్రారంభించారు. కరోనా వేళ అనాథాశ్రమాలకు నిత్యావసరాలు అందించిన సొసైటీ హైదరాబాద్‌ చాప్టర్‌ను అభినందించారు. వెబ్‌నార్‌లో సొసైటీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌ పాఠక్‌, ఇతర ప్రతినిధులు యూఎస్‌ శర్మ, పీ వేణుగోపాల్‌రెడ్డి, పీ మోహన్‌రావు, వై బాబ్జి, డీవీ సుబ్బారావు, కృష్ణబాజీ, కేఆర్‌ చారి పాల్గొన్నారు.


logo